ఆలోచన అస్తమిస్తుంది..
అసమర్ధత అమాంతం అవహిస్తుంది ..
ఎడారిలో ఒంటరి ఒంటెలా,
చిక్కులు పడిన దారంలా,
ఎద అంతా భారంగా,
పాదాలు కదలనంటూ బెట్టు చేస్తూ
మారాం చేస్తుంటే,
దిక్కుతోచని స్థితిలో హృదయం పరుగులెడుతుంటే,
ఏమని బుజ్జగించి ధైర్యాన్ని ఇవ్వాలి ఈ జీవితానికి..
అడుగడుగునా ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటే,
ఎన్నో సందిగ్ద పరిస్థితులు ఎక్కిరిస్తుంటే, ఏమని ఓదార్చేది పసి మనసుని..
చూడాల్సిన భవిష్యత్తు ఎంతో ఉన్నా,
వద్దన్న గతం వెంటపడుతున్నా,,
వర్తమానం వెటకారంగా వెక్కిరిస్తున్నా,
ఈ కపట నాటకంలో పాత్రని పండించేదెలా?
నిసత్తువలా నిశబ్దాన్ని జత చేసుకొని ఇదే జీవిత పరమావధి అనుకోవాలా?
నీశీధిలా నిట్టూర్పుతో నిచ్చలంగా ఉండిపోవాలా?
నాటు వ్యక్తుల మధ్య నాటబడిన నకిలీ విత్తనం అయ్యేలోపు,,
జీవిత నాటకాన్ని కొంతవరకైనా రక్తి కట్టించు..
నీ పాత్రని కొంతవరకైనా పండించు..
కావ్య రామిశెట్టి ✍️
జె.ఎల్. తెలుగు,
గిరిజన గురుకుల బాలికల పాఠశాల & కళాశాల,
చివ్వెంల
సూర్యపేట
0 Comments